నేటి నుంచి కుల గణన

జిల్లాలో అన్ని కులాల వారి సంఖ్యను

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో అన్ని కులాల వారి సంఖ్యను ఈనెల 19వ తేదీ నుంచి లెక్కించనున్నట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కుల గణన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించవచ్చని తెలిపారు. కుల గణన ఈనెల 28వ తేదీ వరకు కొనసాగనుందని, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా వారి వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు. కుల గణనపై ప్రజాప్రతినిధులు, సంబంధిత కుల సంఘాల నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కుల గణనలో నమోదు కాని వారు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్‌ చేసి గణన వివరాలను ఫిబ్రవరి 15 వరకు సరిపోల్చి చూస్తామని తెలిపారు.

➡️