నేడు గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక

సమాయత్తమైన కార్మికులు, రైతులు

మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌, వామపక్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘీభావం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యాన శుక్రవారం గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె చేపట్టేందుకు రైతులు, కార్మికులు సమాయత్తమవుతున్నారు. బంద్‌పై ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. పారిశ్రామికవాడతో పాటు జిల్లాలో ఉన్న జీడి, గ్రానైట్‌, రైస్‌మిల్లులు తదితర పరిశ్రమల యజమానులకు సమ్మె నోటీసు ఇచ్చారు. గ్రామీణ బంద్‌ నేపథ్యాన్ని వివరిస్తూ ఊరూరా కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామాల నుంచి పట్టణాల్లోకి కూరగాయలు, పాలు తీసుకువెళ్లకుండా సమ్మెలో పాల్గొనాలని కోరారు. సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు మద్దతు పలికాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి కార్మిక సంఘాల ఆధ్యర్యంలో నేడు ర్యాలీబంద్‌లో భాగంగా పారిశ్రామిక కార్మికులు ఆధ్యర్యంలో శుక్రవారం పలురూపాల్లో నిరసన చేపట్టనున్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. శ్రీకాకుళం నగరంలో ఉదయం పది గంటలకు ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రదర్శన చేపట్టనున్నారు. పలాసలో ఉదయం పది గంటలకు ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం పాతబస్టాండ్‌ వద్ద సభ నిర్వహించనున్నారు.

➡️