నేడు జిల్లాకు చంద్రబాబు

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాకు రానున్నారు. శ్రీకాకుళం నగరంలో నిర్వహించనున్న రా కదలిరా సభలో

సిద్ధమైన సభావేదిక

శ్రీకాకుళం నగరంలో ‘రా కదలిరా సభ’

ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా నాయకత్వం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాకు రానున్నారు. శ్రీకాకుళం నగరంలో నిర్వహించనున్న రా కదలిరా సభలో పాల్గొని ప్రసం గించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా నాయకత్వం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 80 అడుగుల రహదారి ప్రాంతంలో సభా వేదిక నిర్మించారు. సభకు లక్ష మందిని తరలించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు గణబాబు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మిదేవి సభా వేదిక, గ్యాలరీలను పరిశీలించారు. పర్యటన షెడ్యూల్‌ ఇలాగుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీకాకుళం ఆర్‌అండ్‌బి బంగ్లా ప్రాంగణంలో ఏర్పాటు చేసి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి 2.55 గంటలకు బయలు దేరి సభావేదిక వద్దకు 3 గంటలకు చేరుకుంటారు. 3 నుంచి 4.30 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత 4.45 గంటలకు సభావేదిక నుంచి బయలుదేరి హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి విశాఖకు పయనం కానున్నారు. సభను విజయవంతం చేయాలి శ్రీకాకుళం రూరల్‌ : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం చేపట్టనున్న రా కదిలి రా భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టిడిపి నాయకులకు పిలుపునిచ్చారు. మండలంలోని గూడెం, లింగాలవలస, లంకాం, రాగోలు, వాకలవలస, శిలగాం సింగువలస, తండేంవలస పంచాయతీల్లో ఆదివారం పర్యటించి ప్రజలను అధిక సంఖ్యలో సభకు తరలించాలని కోరారు. ఆమెతో పాటు చిట్టి మోహనరావు, బలగ చెంగలరావు పాల్గొన్నారు.

 

➡️