పంచాయతీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

జిల్లాలోని గ్రామ పంచాయతీల

మాట్లాడుతున్న సహాయక కమిషనర్‌ కృష్ణమోహన్‌

* గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ కమిషనర్‌ కృష్ణమోహన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సహాయక కమిషనర్‌ ఇ.కృష్ణమోహన్‌ సూచించారు. గ్రామ ప్రణాళికల తయారీపై డిపిఆర్‌సిలో మంగళవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో సిఎఫ్‌ఎంఎస్‌లో నివేదికలు సమర్పించే వారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన పిఎఫ్‌ఎంఎస్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే స్థానిక సంస్థలూ వార్షిక ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎంసిఆర్‌డిలు పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిపిఆర్‌సి సమన్వయకర్త వెంకటరాజు, ఎంపిడిఒలు, ఎంసిఆర్‌డిలు పాల్గొన్నారు.

 

➡️