పండగ పూట విషాదం

రెండు టూరిస్టు బస్సులు సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢకొీనడంతో అందులో ప్రయాణిస్తున్న సహాయక

పలాస : దెబ్బతిన్న టూరిస్టు బస్సులు

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సంక్రాంతి పండగ పూట జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలాసలో రెండు టూరిస్టు బస్సులు ఢకొీని ఒకరు, కొత్తూరు మండలం బలద వద్ద బైక్‌ బోల్తాపడి మరొకరు మృతి చెందారు.

ప్రజాశక్తి పలాస

రెండు టూరిస్టు బస్సులు సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢకొీనడంతో అందులో ప్రయాణిస్తున్న సహాయక డ్రైవర్‌ దినేష్‌ విషాద్‌ (26) మృతి చెందారు. మరో ఏడుగురికి యాత్రికులు చిన్నచిన్న గాయాలకు గురై ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పూరి నుంచి అన్నవరం దైవదర్శనం కోసం వెళ్తుంగా.. ఈ సంఘటన జరగ్గా మృతుడు, క్షతగాత్రులంతా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అనుపూర్‌ గ్రామానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పూరి యాత్ర ముగించుకొని జాతీయ రహదారిపై రెండు టూరిస్టు బస్సులు వెళ్తుంగా పలాస జాతీయ రహదారి నెమలినారాయణపురం వద్ద మొదటి టూరిస్టు బస్సు డ్రైవర్‌ బహిర్భూమికి వెళ్లడం కోసం రోడ్డు పక్కకు తిప్పాడు. వెనుక నుంచి వస్తున్న మరో టూరిస్టు బస్సు డ్రైవరు దీన్ని గుర్తించకపోవడంతో ఎదురుగా ఆపేందుకు ప్రయత్నిస్తున్న వాహనాన్ని బలంగా ఢకొీట్టాడు. ఈ సంఘటనలో తాత్కాలికంగా బస్సు డ్రైవరుగా వ్యవహరిస్తున్న మరో డ్రైవర్‌ దినేష్నిషాద్‌ బస్సు క్యాబిన్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనతో పాటు మరో ఏడుగురు గాయపడడంతో వెంటనే స్థానియకులు 108, హైవే అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే పలాస ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి దినేష్నిషాద్‌ మృతి చెందారు. రెండు బస్సుల్లో మొత్తం 104 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. సంఘటన స్థలానికి కాశీబుగ్గ పోలీసులు చేరుకొని ప్రమాదం జరగడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ట్రావెల్‌ బస్సు యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేసి యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించారు. పండగంటి పూట యాత్రికుల బస్సులకు ప్రమాదం జరగడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యాత్రికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి స్థానిక సత్యసాయి మందిర నిర్వాహకులు మల్లా రామేశ్వరరావు, శరత్‌, శ్రీనివాస్‌తో కూడిన బృందం వారికి అల్పాహారం అందించి ఉదారత చాటారు. అదేవిధంగా గ్రీన్‌ఆర్మీ అధ్యక్షుడు బోనెల గోపాల్‌ ఆధ్వర్యాన క్షతగాత్రులకు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.కొత్తూరు : మండలంలోని బలద వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీతంపేట మండలం గోరపాడుకు చెందిన బిడ్డిక కమేశ్వరరావు (42) మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు… ద్విచక్రవాహనంపై రాణిపేట ఉంటున్న బంధువుల ఇంటికి అతివేగంగా వెళ్తున్నాడు. సడన్‌గా బ్రేక్‌ వేయడంతో బైక్‌ పైనుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108లో కొత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షించగా… అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరించారు. మృతుడి తండ్రి గుర్రయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.ఎ.అహ్మద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విశాఖపట్నంలో లారీ డ్రైవరుగా పనిచేస్తున్నారు. దీంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. మృతుడికి పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు.

➡️