పక్కాగా ఎన్నికల నిర్వహణ

ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలని జిల్లా

కవిటి : అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- కవిటి

ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మండలంలోని పెద్దకర్రివానిపాలెంలోని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేం దుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, ఇవిఎంలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం ఏర్పాట్లను ఆయా అధికారులంతా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయనతో పాటు తహశీల్దార్‌ ఎం.లక్ష్మి, ఎంపిడిఒ శ్రీనివాస్‌రెడ్డి, ఇఒపిఆర్‌డి శివాజీ పాణీగ్రాహి, డిటి రామచంద్రరావు, ఆర్‌ఐ రమణమూర్తి పాల్గొన్నారు.కంచిలి: తహశీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధుల్లో గ్రామ వాలంటీర్లు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ రవి, ఎంపిడిఒ నీరజ, ఎస్‌ఐ రాజేష్‌ పాల్గొన్నారు. సోంపేట: సోంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సామగ్రిని భద్రపరి చేందుకు మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై స్థానిక అధికారులతో చర్చించారు. ఈయనతో పాటు ఆర్‌ఒ సుదర్శన్‌, సిఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ హైమావతి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. సరిహద్దులో అప్రమత్తంఇచ్ఛాపురం : ఎన్నికల నిర్వహణపై తహశీల్దార్‌ కార్యాలయ వద్ద ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌దొర, కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరావురెడ్డి, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తంపురం చెక్‌పోస్టును పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరంగా చేయాలన్నారు. డబ్బులు, మద్యం రవాణాపై గట్టి నిఘా ఉండాలన్నారు. వాహనాలన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లవహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం పట్టణ పుర వీధుల్లో నిర్వహించిన పోలీస్‌ కవాతులో పాల్గొన్నారు. బస్టాండ్‌ నుంచి మెయిన్‌ రోడ్డ, మార్కెట్‌, దాసన్నపేట వరకు కవాతు నిర్వహించారు.కార్యక్రమంలో సిఐ టి.ఇమ్మన్యునుల్‌రాజు, డిటి శ్రీహరి, టౌన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ, రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు, కవిటి ఎస్‌ఐ, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

 

➡️