‘పది’ మోడల్‌ పేపర్లు విడుదల

ప్రతి ఏటా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు

మోడల్‌ పేపర్లను విడుదల చేస్తున్న విజయకుమారి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ప్రతి ఏటా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు యుటిఎఫ్‌ సామాజిక బాధ్యతతో మోడల్‌పేపర్లను అందిస్తోందని డిప్యూటీ డిఇఒ విజయకుమారి పేర్కొన్నారు. నగరంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆమె చేతులమీదుగా పదవ తరగతి 2024 మోడల్‌ పేపర్లను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ ఆధ్వర్యాన రూపొందించిన ఎస్‌ఎస్‌సి 2024 మోడల్‌ టెస్ట్‌ పేపర్లను నిష్ణాతులైన సీనియర్‌ ఉపాధ్యాయులచే రూపొందించినట్టు తెలిపారు. 7 పేపర్లను పాట్రన్‌ అండ్‌ ఎగ్జామ్‌ ఓరియెంటెడ్‌లో రూపొందించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి జరిగే కామన్‌ పరీక్షలు దృష్ట్యా అన్నిస్థాయిల విద్యార్థులకు ఉపయోగపడే మోడల్‌ టెస్ట్‌ పేపర్లు ఉత్తీర్ణతకి అనుకూలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, జిల్లా కార్యదర్శులు హెచ్‌ అన్నాజీరావు, జి.సురేష్‌, పి.సూర్యప్రకాష్‌, రాష్ట్ర కౌన్సిలర్లు ఎం.వాగ్దేవి, పి.అప్పారావు, జిల్లా నాయకులు కె.వెంకట్రావు, జి.జనార్ధనరావు పాల్గొన్నారు.

 

➡️