పని దినాల లక్ష్యాలను చేరుకోవాలి

పది దినాల కల్పనలో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇసి, ఎపిఒలు సమన్వయం చేసుకుని మండలాలకు నిర్దేశించిన పని దినాల కల్పనలో లక్ష్యాలను శత శాతం చేరుకోవాల్సిందేనని జిల్లా నీటి

కూలీలతో మాట్లాడుతున్న పీడీ చిట్టిరాజు

  • డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు

ప్రజాశక్తి – మెళియాపుట్టి

పది దినాల కల్పనలో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇసి, ఎపిఒలు సమన్వయం చేసుకుని మండలాలకు నిర్దేశించిన పని దినాల కల్పనలో లక్ష్యాలను శత శాతం చేరుకోవాల్సిందేనని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి చిట్టిరాజు స్పష్టం చేశారు. పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోట మండలాల్లో పర్యటించిన పీడీ ఆయా మండలాల్లో ఉపాధి హామీ సిబ్బందితో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా క్షేత్రస్థాయిలో పని కోరిన ప్రతి జాబ్‌కార్డుదారుని ఉపాధి కల్పించాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంట కాలువల పూడికతీత పనులకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాలువ పనులు అంచనా, అవసరం మేరకు తక్షణమే వేసి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని పంచాయతీల ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఈనెల 20వ తేదీ నాటికి కనీసం 25 రోజుల పని దినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సగటు గరిష్ట కూలి పెరిగే విధంగా కూలీలతో కొలతల మేరకు పనులు చేయించారన్నారు. అనంతరం మెళియాపుట్టి మండలంలోని సుందరాడ పంచాయతీ పరిధి దేశి చెరువు పనులను పరిశీలించారు. పాతపట్నం మండల గ్రామ సచివాలయల సిబ్బంది, వాలంటీర్ల శిక్షణా సమావేశంలో పాల్గొని సిబ్బందికి అవగాహనా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిఒలు టి.రవి, సోమేశ్వరరావు, నారాయణరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️