పొందూరు ఖాదీ అభ్యున్నతికి కృషి

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు కలిగిన పొందూరు సన్నఖాదీ అభ్యున్నతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు పట్టణంలో ఎఎఫ్‌కెకె సంఘం ఆధ్వర్యాన నిర్మించిన

ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

  • శాసనసభ స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- పొందూరు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు కలిగిన పొందూరు సన్నఖాదీ అభ్యున్నతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు పట్టణంలో ఎఎఫ్‌కెకె సంఘం ఆధ్వర్యాన నిర్మించిన వాణిజ్య దుకాణా సముదాయాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ఖాదీ నిలయంలోని మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఖాధీ వస్త్రాలను ప్రతిఒక్కరూ ధరించాలని కోరారు. ముఖ్యంగా యువత ఖాధీ వస్త్రాల వినియోగంపై మక్కువ చూపాలని అన్నారు. పొందూరులో చేనేత క్లష్టర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. పొందూరు ఖాధీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ముఖ్యమంత్రి జటన్‌ ప్రకటించి రూ.10 లక్షలు ప్రోత్సాహకాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఎఫ్‌కెకె సంఘం ఈ రూ.10 లక్షలతో వాణిజ్య దుకాణాల సముదాయాన్ని నిర్మించడం ఆనందించదగ్గ విషయమని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్‌, ఎంపిపి ప్రతినిది కిల్లి నాగేశ్వరరావు, ఎఫ్‌కెకె సంఘం అధ్యక్ష, కార్యదర్శిలు కామేశ్వరప్రసాద్‌, వెంకటరమణ, వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారు జైప్రతాప్‌కుమార్‌, ఎంపిటిసి పద్మావతి, వైస్‌ ఎంపిపి ప్రతినిధి వండాన వెంకటరావు, వైసిపి పట్టణ అద్యక్షులు గాడు నాగరాజు, కిల్లాన సూర్యారావు, రమణమ్మ, అన్నాజీరావు, గూనాన కృష్ణ పాల్గొన్నారు.

 

➡️