ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రచారానికి

మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌దొర

ఇచ్ఛాపురం:

ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రచారానికి ముందస్తుగా అనుమతి తప్పనసరిగా తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌దొర సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ పొలిటికల్‌ పార్టీలతో మోడల్‌ కోడ్‌, ఇంటింటి ప్రచారాలు, ర్యాలీ, సభలపై అనుమతులు తీసుకోవాలన్నారు. ఈ నిబంధనల ఉల్లగించి సమావేశాలు, ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️