ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు వాలంటీర్లు

ప్రజలకు, ప్రభుత్వానికి వారధులే వాలంటీర్లని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలో

ఆమదాలవలస : మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

ప్రజలకు, ప్రభుత్వానికి వారధులే వాలంటీర్లని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం, మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అర్హుల ఇంటి ముంగిటకు చేరవేస్తున్న ఘనత వారికే దక్కుతుందన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రతిభను కనబరుస్తున్న వాలంటీర్లే మా బలగం, బలం అన్నారు. అవినీతికి తావు లేని వాలంటీర్‌ వ్యవస్థను సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారని, జగనన్న సైన్యాన్ని చూసి రాష్ట్రం గర్విస్తుందన్నారు. ప్రభుత్వంపై ఎవరు నిందలు వేసినా నిజాలు చెప్పగలిగే సత్యసారథులు వలంటీర్లేనని అన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్‌, వైసిపి నాయకులు బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, డిసిసిబి డైరెక్టర్‌ బొడ్డేపల్లి నారాయణరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, బోర చిన్నంనాయుడు, మండల సచివాలయాల కో-ఆర్డినేటర్‌ బొడ్డేపల్లి నిరంజన్‌, దుంపల శ్యామలరావు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : మండల పరిషత్‌ కార్యాలయంలో వాలంటీర్లను జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ సన్మానించి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు నర్తు నరేంద్రయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ సేవవజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమం లో బిసిసెల్‌ జోనల్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి డాక్టర్‌ ధర్మాన కృష్ణదాస్‌, ఎంపిపి ఆరంగి మురళీధర్‌, జెడ్‌పిటిసి చింతు రామారావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు పోన్నాన దాలినాయుడు, వైస్‌ ఎంపిపి పాగోటి రాజారావు, చింతల వెంకటరమణ, జెసిఎస్‌ కన్వీనర్‌ సురంగి నర్సింగరావు, సుడా చైర్మన్‌ కోరాడ చంద్రభూషణ గుప్త, పొందర కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజాపు అప్పన్న, ప్రచార జిల్లా కార్యదర్శి బార్ల వేణుగోపాలరావు పాల్గొన్నారు.

 

➡️