‘ప్రజాశక్తి’ డైరీ ఆవిష్కరణ

ప్రజాశక్తి దినపత్రిక 2024 డైరీ, కేలండర్లను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తన ఛాంబర్‌లో శనివారం ఆవిష్కరించారు. ప్రజాశక్తి కేలండర్‌ ప్రత్యేకత ను

ప్రజాశక్తి డైరీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

శ్రీకాకుళం : ప్రజాశక్తి దినపత్రిక 2024 డైరీ, కేలండర్లను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తన ఛాంబర్‌లో శనివారం ఆవిష్కరించారు. ప్రజాశక్తి కేలండర్‌ ప్రత్యేకత ను శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాశక్తి స్టాఫ్‌ రిపోర్టర్‌ టి.భీమారావు, ఎడివిటి జిల్లా ఇన్‌ఛార్జి టి.బుజ్జిబాబు, పి.వాసు పాల్గొన్నారు.

 

➡️