ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సిఎం జగన్మోహనరెడ్డి పాలనను కొనసాగిస్తున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస : మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సిఎం జగన్మోహనరెడ్డి పాలనను కొనసాగిస్తున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం పట్టణంలో జూనియర్‌ కాలేజీలో వైఎస్‌ఆర్‌ పింఛను పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పింఛను అంటేనే టెన్షన్‌గా ఉండేదన్నారు. నేడు జగన్‌ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా ఎటువంటి రాజకీయ, కుల, వర్గ, మత, అవినీతికి తావులేకుండా సంక్షేమం ఇంటి తలుపుతట్టి మరీ చేరువచేస్తున్న వైనాన్ని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పెంచిన పెన్షన్లు, రూ.25 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌, కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, వైసిపి నాయకులు బి.రమేష్‌ కుమార్‌, ఉమా మహేశ్వరరావు, డి.శ్యామలరావు, ఎం.రమేష్‌, ఎస్‌.మల్లిఖార్జునరావు, బి.వి.రమణమూర్తి, సిహెచ్‌ వెంకటరమణ, ఎస్‌.రాజు పాల్గొన్నారు.కంచిలి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మరల ఆశీర్వదించాలని స్థానిక జడ్పీ చైర్‌ పర్సన్‌ పీరియా విజయ కోరారు. కంచిలి మార్కెట్‌ యార్డ్‌ వద్ద బుధవారం నిర్వహించిన వైయస్సార్‌ పింఛన్‌ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను 100% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి దే అన్నారు. పెన్షన్‌ 3000 రూపాయల కు పెంచుతానని ఇచ్చిన హామీని దశలవారీగా నెరవేర్చారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలు, అవ్వలు, తాతలు ముఖ్యమంత్రిని మరల ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఇప్పిలి లోలాక్షి, ఎంపీపీ దేవదాస్‌ రెడ్డి, వజ్జ మత్యుంజయం, లడ్డు కేశవ పాత్రో, కే సురేష్‌, పి జయరాం, డి బలరాం, ఇప్పీలి కష్ణారావు తదితరులు పాల్గొన్నారు.కవిటి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు కొనియాడారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో నూతన పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షుడు దేవరాజు సాహు, ఎఎబి చైర్మన్‌ దువ్వు కృష్ణారెడ్డి, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ వై.నీలయ్య, కో-ఆప్షన్‌ మెంబర్‌ పాండవ శేఖర్‌, వైస్‌ ఎంపిపి కర్రి గోపయ్య, ఎంపిటిసిలు పూడి నీలాచలం, సర్పంచ్‌లు ఎస్‌.పి.నారాయణస్వామి, దూగాన భద్రాచలం పాల్గొన్నారు.సోంపేట : స్థానిక సంస్కార భారతి విద్యాసంస్థలో పింఛను కానుకను జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి నిమ్మన దాసు, సర్పంచ్‌ నగిరి ప్రభావతి, నాయకులు ఎస్‌.భాస్కరరావు, బి.శ్రీకృష్ణ, ఆర్‌.విశ్వనాథం, పి.మోహనరావు, బి.రామారావు, జి.శ్రీను, పి.కామేష్‌, ఎం.వెంకటరావు, టి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. పోలాకి : స్థానిక మండల పరిషత్‌లో పెంచిన పింఛను కానుకను ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, సర్పంచ్‌ మజ్జి రమణమ్మ, ఎంపిడిఒ ఉషశ్రీ, తహశీల్దార్‌ కె.శ్రీరాములు, సూపరింటెండెంట్‌ సూర్యప్రకాష్‌ పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ : అవ్వ తాతల, వికలాంగుల, వితంతువుల సంతోషమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకువచ్చే విధంగా వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను అందిస్తున్నారని టెక్కలి నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త దువ్వాడ వాణి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో రూ.3 వేలు పింఛను పంపిణీచేశారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి, వైసిపి మహిళా విభాగం అధ్యక్షులు చింతాడ మంజు, ఎంపిపి అట్లా సరోజనమ్మ, వైస్‌ ఎంపిపిలు పేడాడ రమేష్‌, మన్నెల కిషోర్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు సత్తారు ఉషారాణి, ఎంపిటిసిలు కూన పార్వతి, పీత హేమలత, మండల పార్టీ అధ్యక్షులు బగాది హరి, మండల సచివాలయం కన్వీనర్లు శిగిలిపల్లి మోహనరావు పాల్గొన్నారు. పలాస : మండలంలోని అల్లుకోలలో ఎంపిడిఒ రమేష్‌నాయుడు పింఛన్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు, సచివాలయం మండల కన్వీనర్‌ దువ్వాడ రవికుమార్‌, గుంట సత్యం మస్టారు, శ్రీనివాసరావు, కార్యదర్శి చిరంజీవి పాల్గొన్నారు. సంతబొమ్మాళి : మండలంలోని ఉమిలాడ గ్రామ సచివాలయం పరిధిలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను పిఎసిఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, సర్పంచ్‌ కెల్లి లక్ష్మి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌.బి.కొత్తూరు సర్పంచ్‌ ప్రతినిధి ఉప్పాడ లోకనాతం, ఉమిలాడ వైస్‌ సర్పంచ్‌ కోడ దామోదర్‌, వైసిపి నాయకులు అడ్ల అప్పారావు పాల్గొన్నారు. రణస్థలం: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పెంపు కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ లబ్ధిదారులకు బుధవారం పెంచిన పింఛన్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండలం ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్‌, జడ్‌పిటిసి టొంపల సీతారాం, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి చిల్ల వెంకటరెడ్డి, వైస్‌ ఎంపిపి రాయపురెడ్డి బుజ్జి, జె.ఆర్‌.పురం సర్పంచ్‌ బవిరి రమణ, ఎంపిటిసి ప్రతినిధి పచ్చిగుళ్ల సాయిరాం, వైసిపి నాయకులు పిన్నింటి సత్యంనాయుడు, దన్నాన శ్రీరామ్‌, ఎంపిడిఒ రమణమూర్తి, ఎఒ ధనుంజయరావు, ఇఒపిఆర్‌డి ప్రభాకరరావు పాల్గొన్నారు.ఎచ్చెర్ల: వైసిపి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో రూ.3వేలకు పెంచిన పింఛన్లును ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు అందచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉమెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బల్లాడ హేమ మాలినిరెడ్డి, ఎంపిపి మొదలవలస చిరంజీవి, పిఎసిఎస్‌ చైర్మన్‌ సనపల నారాయణరావు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి మూగి శ్రీరాములు, వైసిపి నాయకులు మురళీధర్‌ బాబా, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబటి రాంబాబు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సచివాలయ కన్వీనర్లు, ఎంపిడిఒ రమాదేవి, ఎపిఎం రమణమూర్తి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

 

➡️