ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా సురక్షిత తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు శాసనసభ

స్పీకర్‌ తమ్మినేనిని నిలదీస్తున్న రామరాజు

  • శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంప్ర

జాశక్తి – సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూర్జఆమదాలవలస

నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా సురక్షిత తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సరుబుజ్జిలి మండలం వీరమల్లిపేట, సింధువాడలో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిలను గురువారం ప్రారంభించారు. అనంతరం అదే గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి నాలుగున్నరేళ్లలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను జల్‌ జీవన్‌ మిషన్‌ కల్పిస్తోందన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. గతంలో ఒక పథకం కావాలంటే మండల కేంద్రానికి వెళ్లి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఉన్న ఊరిలోనే గ్రామ సచివాలయంలో పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో సరుబుజ్జిలి ఎంపిపి కె.వి.జి సత్యనారాయణ, వైస్‌ ఎంపిపి ఎల్‌.అనిల్‌ కుమార్‌, శివానందబాబు, వైసిపి మండల అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ కె.చంద్రశేఖర్‌, సర్పంచ్‌ గోవింద కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.బూర్జ మండలం పాలవలసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి కె.దీప, జెడ్‌పిటిసి బి.రామారావు, వైసిపి మండల అధ్యక్షులు కె.గోవిందరావు, వైస్‌ ఎంపిపి కె.కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.సమస్యలపై నిలదీతసరుబుజ్జిలి మండలం వీరమల్లిపేటలో నెలకొన్న పలు సమస్యలపై స్పీకర్‌ సీతారాంను స్థానికులు నిలదీశారు. గ్రామంలో కాలువల్లేకపోవడంతో వర్షాలు కురిస్తే ఇంటి గుమ్మంలోకి మురుగునీరు చేరుతోందని, దీంతో రోగాల బారిన పడుతున్నామని మహాలక్ష్మి, మట్ట దమయంతి స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కాలువలు, రహదారులు నిర్మించకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని వైస్‌ ఎంపిపి శివానంద మూర్తి స్పీకర్‌కు చెప్పారు. ఎవరు అడ్డుకుంటున్నారని, నిధులు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని గ్రామానికి చెందిన రామరాజు చెప్పారు.విలేకరిపై దురుసు ప్రవర్తనసమస్యలపై స్థానికులు నిలదీస్తున్న ఫొటోలను తీస్తున్న ప్రజాశక్తి విలేకరి డి.శ్రీనివాసరావుపై స్పీకర్‌ సీతారాం, వైసిపి నాయకులు దురుసుగా ప్రవర్తించారు. విలేకరి ఫోన్‌, గుర్తింపు కార్డును స్పీకర్‌ భద్రతా సిబ్బంది లాక్కొని దుర్భాషలాడారు. ప్రజా క్షేత్రంలో ప్రజలు కొన్నిసార్లు అడుగుతుంటారని, అవి కామన్‌ అని వాటిని పత్రికల్లో రాయాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు, స్పీకర్‌ భద్రతా సిబ్బంది ఫోన్‌లో ఫొటోలు, వీడియోలను తొలగించి ఫోన్‌, గుర్తింపుకార్డును తిరిగి ఇచ్చారు. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి విలేకరిపై చిందులు తొక్కడం సరికాదని అక్కడున్న వారు చర్చించుకున్నారు.

 

➡️