ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

జాతీయ ఉపకార వేతనం ఎంపిక (ఎన్‌ఎంఎస్‌ఎస్‌) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పలు పాఠశాలల్లో నిర్వహించే కేంద్రాల వద్ద విద్యార్థులకు

టెక్కలి : పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న పగడాలమ్మ

ప్రజాశక్తి- టెక్కలి

జాతీయ ఉపకార వేతనం ఎంపిక (ఎన్‌ఎంఎస్‌ఎస్‌) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పలు పాఠశాలల్లో నిర్వహించే కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. నిర్ణీత సమయానికే విద్యార్దులు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం 23 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసారు. జిల్లాలో 5,533 మంది విద్యార్థిని, విద్యార్థులు హజరు కావాల్సి ఉండగా 5,442 మంది హాజరయ్యారు. రెండు డివిజన్‌లలో పలు కేంద్రాలను టెక్కలి డివిజన్‌ ఉపవిధ్యాశాఖాధికారిణి గార పగడాలమ్మ పర్యవేక్షించి పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.పలాస: పలాస డివిజన్‌ పరిధిలో నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షలకు 1774 మంది విద్యార్థులు హాజరయ్యారు. పలాస, ఇచ్చాపురం, కవిటి కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల నుంచి 1800 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1774 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో పలాస ఉన్నత పాఠశాలలో 264 మందికి 259 మంది, కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో 240 మందికి 235 మంది, భాష్యం పాఠశాలలో 240 మందికి 237 మంది, గురుకుల పాఠశాలలో 240 మందికి 238 మంది, ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో 288 మందికి 284 మంది, నారాయణ పాఠశాలలో 240 మందికి 236 మంది, శ్రీ చైతన్య పాఠశాలలో 288 మందికి 285 మంది విద్యార్థులు పరీక్షలు రాసారు. పరీక్ష కేంద్రాలు వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను టెక్కలి ఉప విద్యాశాఖాధికారిణి జి.పగడాలమ్మ, పలాస ఎంఇఒ సిహెచ్‌ శ్రీనివాసరావు పరిశీలించారు.

 

➡️