ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

జిల్లాలో ఎపిపిఎస్‌సి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న

పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

63.85 శాతం హాజరైన అభ్యర్థులు

 2,279 మంది గైర్హాజరు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో ఎపిపిఎస్‌సి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న గ్రూప్‌-1 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 6403 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2279 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. మిగిలిన 4124 మంది పరీక్షకు హాజర య్యారు. జిల్లా వ్యాప్తంగా 63.85 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నగరంలోని శ్రీచైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ పరిశీలించారు. అలాగే నగరం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరీక్షల సమన్వయాధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎ.నవీన్‌ పరిశీలించారు.

 

➡️