బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి

Mar 5,2024 21:07

ప్రజాశక్తి- జలుమూరు : ఈ నెల 8 నుంచి 11 వరకు శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి, చక్రతీర్థ స్నానాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని.. ఎస్‌పి జి.ఆర్‌.రాధికతో కలిసి మంగళవారం పరిశీలించారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే యాత్రికుల క్యూలైన్ల ఏర్పాట్లు, చక్రతీర్థ స్నానాలు రోజున నది వద్ద ఏర్పాట్లు, బారికేడ్లు, రూట్‌ మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. చక్రతీర్థ స్నానాలకు వచ్చే ప్రజలకు ఆటంకాలు లేకుండా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాలని, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఐ బి.ప్రసాదరావు పాల్గొన్నారు.

➡️