బడుగుల ఆశాజ్యోతి ఎన్‌టిఆర్‌

ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత మాజీ సిఎం ఎన్‌.టి.రామారావుకే దక్కిందని ఎమ్మెల్యే

ఇచ్ఛాపురం : విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత మాజీ సిఎం ఎన్‌.టి.రామారావుకే దక్కిందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ ఎన్‌టిఆర్‌ వర్థంతి సందర్భంగా పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కాళ్ల ధర్మారావు, సాలీనా ఢిల్లీ యాదవ్‌, నంధిక జాని, కాళ్ల జయదేవ్‌, దక్కత ఢిల్లీరావు, ఆశి లీలారాణి, లోపింట పద్మనాభం, శాడి సహదేవారెడ్డి, కామేశ్వరరావు, పి.తవితయ్య, జానకిరావు పాల్గొన్నారు. ఆమదాలవలస : తెలుగుజాతి బతికున్నంత వరకు వారి గుండెల్లో ఎన్‌టిఆర్‌ చిరస్మరణీయుడుగా నిలుస్తారని టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. గురువారం ఎన్‌టిఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో పారిశ్రామికవాడ వద్ద ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ముందుగా రవికుమార్‌ రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా 30 మంది పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం వారికి ప్రశంసాపత్రాలను పంపిణీ చేసారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న రవికుమార్‌ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. రక్తదాన శిబిరంలో ఉన్న వైద్య సిబ్బంది రవికుమార్‌ను పరిశీలించి వెంటనే జిల్లా కేంద్రంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రాథమిక వైద్యం అందించి కొద్దిసేపటి తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, టిడిపి నాయకులు ఆనెపు రామకృష్ణ, నూకరాజు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తమ్మినేని గీతా సాగర్‌, శివ్వాల సూర్యనారాయణ, అంబల్ల రాంబాబు, చిగురుపల్లి రామ్మోహన్‌ పాల్గొన్నారు.కవిటి: స్థానిక బస్టాండ్‌ కూడలిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం కవిటి ప్రభుత్వాస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో నాయకులు పొందల కృష్ణారావు, బెందాళం రమేష్‌, సీపాన రమణ, లోళ్ల శ్రీను, పుల్లట సంతోష్‌, బాసు దేవ్‌రౌలో, సంతోష్‌ పట్నాయక్‌, రంగా రౌలో, పుల్లట రాజు తదితరులు పాల్గొన్నారు.నరసన్నపేట : పట్టణంలోని ఎన్‌టిఆర్‌ చిల్డ్రన్‌ పార్క్‌ వద్ద ఉన్న మాజీ సిఎం ఎన్‌.టి.రామరావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో బిసి సంఘ నాయకులు ధర్మాన తేజ్‌కుమార్‌, జల్లు చంద్రమౌళి, భైరి భాస్కరరావు, బేవర రాము, కత్తిరి వెంకటరమణ, శిమ్మ చంద్రశేఖర్‌, మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, లుకలాపు రాంబాబు, చిట్టి సింహాచలం, వి.రాజేంద్రనాయుడు పాల్గొన్నారు. పలాస : రక్తదానం రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడుతుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పలాస టిడిపి కార్యాలయం ఆవరణలో ఎన్‌టిఆర్‌ వర్థంతి సందర్భంగా కాశీబుగ్గ బస్టాండ్‌ ఆవరణలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ సొసైటీ, టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు 220 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు పాల్గొన్నారు. టెక్కలి : పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి, మాజీ ఎంపిపి మట్ట సుందరమ్మ, మహిళా అధ్యక్షులు మెండ దమయంతి, హనుమంతు రామకృష్ణ, చాపర గణపతి, పోలాకి షణ్ముఖరావు, మామిడి రాము, కోళ్ల లవకుమార్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్‌చంద్‌, మల్లిపెద్ది మధులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. మెళియాపుట్టి : మండలంలోని పెద్దపద్మాపురంలో ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి సర్పంచ్‌ మాలతి జయలక్ష్మి, ప్రతినిధి మాలతి శ్రీధర్‌, మాజీ సర్పంచ్‌ ఉర్లాన రుక్మందరరావు, ఉర్లాన వసంతరావులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కంచిలి: కంచిలిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహానికి టిడిపి నాయకులు మాదిన రామారావు, మాదిన ప్రదీప్‌, ఎం.ఎ.పట్నాయక్‌, టి.వి.రమణ, మర్రిపాటి పూర్ణ, సనపల కామేష్‌, బొడ్డు అప్పారావు, బి.కొరయ్య, బి.హరిబాబు, జగదీష్‌ పట్నాయక్‌, ఎం.కేశవరావులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కోటబొమ్మాళి: స్థానిక బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులుకింజరాపు హరివరప్రసాద్‌, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు పూజారి శైలజ, ఎఎంసి మాజీ చైర్మన్‌ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షులు గొండ లక్ష్మణరావు పాల్గొన్నారు. రణస్థలం: స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మండల నాయకులు పిషిణి జగన్నాథం నాయుడు, పైడి ఆప్పాడ దొర, పిషిణి ఆసిరినాయుడు, హరి, మండపాక కనకరావు, డిజిఎం ఆనందరావు పాల్గొన్నారు.లావేరు: ఎన్‌టిఆర్‌ వర్థంతి సందర్భంగా లావేరు కూడలిలో ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళ్లర్పించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఎచ్చెర్ల మాజీ ఎఎంసి చైర్మన్‌ యినపకుర్తి తోటయ్యదొర, బాసిన ప్రకాశరావు, నాయకులు లంకలపల్లి జగన్నదొర, శ్రీను, మాజీ జెడ్‌పిటిసి త్రినాధ్‌ పాల్గొన్నారు అలాగే చిలకపాళెంలో కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తాదానం చేశారు. అలాగే పేదలకు దుస్తులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల టిడిపి అధ్యక్షుడు బెండి మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌, యినపకుర్తి తోటయ్యదొర, లంక శ్యాం, కనకరావు, సర్పించ్‌ రౌతు శ్రీనువాసురావు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్‌: స్వర్గీయ ఎన్‌టిఆర్‌ 28వ వర్థంతి కార్యక్రమాన్ని టిడిపి నాయకులు నిర్వహించారు. నగరంలో పలు కూడళ్లలో ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు నివాళ్లర్పించారు. ఏడు రోడ్ల కూడలివద్ద పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శింతు సుధాకర్‌, అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చిట్టి మోహన్‌, పిఎంజె బాబు, బొణిగి భాస్కరరావు, రూరల్‌ మండల పార్టీ అధ్యక్షులు సీర రమణ, గార మండలపార్టీ ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్‌ పాల్గొన్నారు. నగరంలోని ఏడు రోడ్లు కూడలి వద్ద ఎన్‌టిఆర్‌ 28వ వర్ధంతిని పురస్కరించుకొని సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అంబటి లక్ష్మి రాజ్యం, పాండ్రంకి శంకర్‌, ఇప్పిలి తిరుమలరావు, రెడ్డి శంకర్‌, ముకళ్ల శ్రీను, మాజీ ఎంపిపి గుండ భాస్కరరావు, గొండు వెంకట రమణమూర్తి, బుర్రి మధు పాల్గొన్నారు.

 

➡️