బాధితునికి న్యాయం జరిగే వరకూ పోరాటం

సంతబొమ్మాళి మండలం నౌపడ ఎంపిటిసి లోపింటి రాములు సోదరుని కుమారుడు లోపింటి శేషురెడ్డి ఇటీవల పోర్టు వాహనాన్ని వెనక నుంచి ద్విచక్ర వాహనంతో ఢకొీని మృతి చెందారు. మూలపేట పోర్టు యాజమాన్యమే అతని మృతిపై నైతిక బాధ్యత వహించి నష్టపరహారం చెల్లించాలని వైసిపి నేతలు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని కేంద్ర మాజీ మంత్రి

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి- నౌపడ

సంతబొమ్మాళి మండలం నౌపడ ఎంపిటిసి లోపింటి రాములు సోదరుని కుమారుడు లోపింటి శేషురెడ్డి ఇటీవల పోర్టు వాహనాన్ని వెనక నుంచి ద్విచక్ర వాహనంతో ఢకొీని మృతి చెందారు. మూలపేట పోర్టు యాజమాన్యమే అతని మృతిపై నైతిక బాధ్యత వహించి నష్టపరహారం చెల్లించాలని వైసిపి నేతలు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, నౌపడ సర్పంచ్‌ పిలక రవికుమార్‌రెడ్డి, ఎంపిటిసి సుధాకర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం నౌపడలోని మృతుని కుటుంబానికి పరామర్శకు వెళ్లిన నాయకులు స్థానిక విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల్లో అతనికి న్యాయం చేయకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను అడ్డుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ స్పందించి శేషురెడ్డి కుటుంబానికి న్యాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అవసరమైతే ఈ నెల 27న మూలపేట పోర్టు సందర్శనకు వస్తున్న వై.వి.సుబ్బారెడ్డిని కలిసి బాధిత కుటుంబానికి అన్ని రకాల న్యాయం చేసేందుకు సమస్యను వివరిస్తామని తెలియజేశారు. అలాగే రోడ్డుకు అడ్డంగా నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తూ పోర్టు వాహనాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. పరిమితికి మించి లోడుతో అతివేగంగా ప్రయాణించి మిగతా వాహనదారులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. ట్రాన్స్‌పోర్టు, పోలీస్‌ అధికారులు వీరిపై దృష్టి సారించి ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నందిగాం ఎంపిపి ఎన్‌.శ్రీరామ్మూర్తి, చిన్ని జోగారావు పాల్గొన్నారు.

 

➡️