బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న

మాట్లాడుతున్న పరమేశ్వరరావు

డిసిసి అధ్యక్షులు పరమేశ్వరరావు

ఇచ్ఛాపురం:

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాహుల్‌ గాంధీ నిరంతర పోరాటం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు అన్నారు. పట్టణంలోని మసీద్‌ వీధిలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ విధానాలపై రాహుల్‌గాంధీ యుద్ధం చేస్తున్నారని అన్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ గట్టిపోరాటం చేస్తుందన్నారు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం పెద్దన్న పాత్ర అని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎవ్వరికీ రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని స్పష్టం చేశారు. జిల్లాలో అన్ని నియోజికవర్గలో పోటీ చేయాలని అనేక మంది ఆశావహులు ఉన్నారని అన్నారు. త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వై.ఎస్‌.షర్మిల నాయకత్వంలో ముందుకు వెళ్తుందని అన్నారు. అనంతరం బిజెపి నుంచి తులసీరావుతో పాటు తొమ్మిది మంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం సమన్వయ కమిటీ సభ్యులు మాసు పత్రీ చక్రవర్తిరెడ్డి, ఆలీం ఖాన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, రాష్ట్ర ఎస్‌టి డిపార్ట్‌మెంట్‌ ప్రధాన కార్యదర్శి మధుసూదనరావు, మండల అధ్యక్షులు పాపారావు పాల్గొన్నారు.

 

➡️