భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

దీక్షకు సంఘీభావం తెలుపుతున్న అప్పలసూర్యనారాయణ

  • న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ భూ హక్కు చట్టాన్ని నిరసిస్తూ 50 రోజులుగా భూహక్కు చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాదులు పలురూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సామాన్యులు అనేక ఇబ్బందులు పడతారని తెలిపారు. న్యాయస్థానాలనూ ఆశ్రయించే అవకాశం కోల్పోతారని చెప్పారు. ఇప్పటికే ఈ చట్టంపై న్యాయస్థానాల్లో దావాలు వేసినట్లు తెలిపారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షకు మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు గుండ అప్పలసూర్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీనిచ్చారు. దీక్షలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్ని సూర్యారావు, పొన్నాడ రాము, న్యాయవాదులు ఎం.భవానీప్రసాద్‌, కె.పార్థసారథి, కె.సూర్యనారాయణ, పి.వి రవి కూర్చొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు గేదెల వాసుదేవరావు, సీనియర్‌ న్యాయవాదులు వాన కృష్ణచంద్‌, కూన రాజారావు, సనపల హరి, కూన అన్నంనాయుడు, ఎ.ఉమామహేశ్వరరావు, కె.సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️