మంత్రుల పర్యటనకు బలవుతున్న ఉద్యోగులు

ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తామని, ఎక్కడా అవినీతికి అస్కారమే ఉండదని ప్రజలకు నమ్మించే వైసిపి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యటనలకు ఎంత ఇస్తున్నారో జవాబు చెప్పాలని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ

అప్పలసూర్యనారాయణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తామని, ఎక్కడా అవినీతికి అస్కారమే ఉండదని ప్రజలకు నమ్మించే వైసిపి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యటనలకు ఎంత ఇస్తున్నారో జవాబు చెప్పాలని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. సత్యసాయి జిల్లాలో మడకశిర తహశీల్దార్‌, విఆర్‌ఒ లంచం తీసుకుంటూ ఆ మొత్తాన్ని ప్రజాప్రతినిధుల పర్యటనలకే ఖర్చు చేస్తున్నామని చెప్పడం ఆలోచించాల్సిన అంశమన్నారు. సోమవారం అరసవల్లిలో ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధుల పర్యటనలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు వెచ్చించకుండా ఉద్యోగులపై రుద్దు తున్నారనడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వంలో ఉద్యోగులు వత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ ఘటనలో బాధితులుగా ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే ప్రభుత్వం అందుకు కారణాలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారని, వారి జీతభత్యాలు కూడా సకాలంలో ప్రభుత్వం విడుదల చేయక పోవడమే ఈ దుస్థితికి కారణమవుతోందన్నారు. అధికారులు ప్రజలను పీడించడంమాని ప్రోటోకాల్‌ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు.

 

➡️