మత్స్యకారులు అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచౌంగ్‌ తుపానుగా బలపడడంతో తీర ప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం కడలి కల్లోలంగా మారి ఈదురు గాలులు వీస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా

వజ్రపుకొత్తూరు : అక్కుపల్లి తీరంలో సురక్షిత ప్రాంతాలకు చేర్చిన బోట్లు

వజ్రపుకొత్తూరు:

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచౌంగ్‌ తుపానుగా బలపడడంతో తీర ప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం కడలి కల్లోలంగా మారి ఈదురు గాలులు వీస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా బోట్లును, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇంటికే పరిమితమయ్యారు. దేవునల్తాడ, కొత్తపేట, కంబాల రాయుడుపేట, డోకులపాడు, అక్కుపల్లి, గునుపల్లి చేపలవేట తీరాల్లో అలల అలజడి ఎక్కువై అలలు తీరానికి సుమారు 50 మీటర్ల ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. తీరంలోని 11 మత్స్యకార పంచాయతీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని దండోర వేయించామని తహశీల్దార్‌ అప్పలస్వామి తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయంలో 9550669551తో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. 14 మంది రెవెన్యూ సిబ్బందిని కంట్రోల్‌ రూంలో అందుబాటులో ఉంచామని తహశీల్దార్‌ తెలిపారు. వరి పంటను కోసిన రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.బూర్జ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తుపాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ రమణారావు సూచించారు. నాగావళి నదీతీర ప్రాంతాలైన అల్లెన, కిలంతరి, లాభాం తదితర గ్రామాల ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నది సమీపానికి వెళ్లవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో కార్యాలయానికి సమాచారం అందించాలని ఆదేశించారు.పలాస: సోమ, మంగళవారాల్లో తుపాను తీవ్రంగా ఉంటుం దని, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ ఎల్‌.మధుసూధనరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులో తుఫాను తీరం దాటే ప్రమాదం ఉందని, రైతులు తమ పంటలను కోత కోయవద్దని, కోసిన వారు కుప్పలు భద్ర పరుచుకోవాలని సూచించారు. 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందన్నారు.

 

➡️