మద్యం అక్రమ రవాణాపై చర్యలు

ఎన్నికల నియమావళిని ఎవరూ దాటొద్దని ప్రొహిబిషన్‌ అండ్‌

అవగాహన కల్పిస్తున్న సుబ్బారావు

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జిల్లా అధికారి సుబ్బారావు

ఎచ్చెర్ల:

ఎన్నికల నియమావళిని ఎవరూ దాటొద్దని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జిల్లా అధికారి బి.సుబ్బారావు ఎక్సైజ్‌ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఎచ్చెర్ల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్ద ఎక్సైజ్‌ శాఖ సిబ్బందితో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సోమవారం అవగాహన కల్పించా రు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినందున సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బారుల వద్ద, షాపు లోపల, బయట రాజకీయ నాయకుల ఫొటోలు ఉండరాదన్నారు. షాపుల వద్ద సిసి కెమేరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పుస్తకాలు అన్ని అప్‌డేట్‌గా ఉండాలన్నారు. షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు తెరచి ఉండాలన్నారు. ఒక వ్యక్తికి మూడు బాటిళ్లు వరకు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. ఎవరైనా ఒక వ్యక్తి మూడు మూడు బాటిళ్లు చొప్పున తీసుకువెళ్లినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్‌ యజమానులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘీంచినా కఠిన చర్యలు ఉంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినచో కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చన్నారు. జిల్లా ఎక్సైజ్‌శాఖ కంట్రోల్‌ రూమ్‌ నంబరు 798934 3418 అని అన్నారు. సమావేశంలో శ్రీకాకుళం యూనిట్‌ సిఐ కె.లక్ష్మి, పలాస డివిజన్‌ ఐ.ఇందు మతి, ఎస్‌ఐలు పి.రాజగోపాల్‌, పివివిఎస్‌ఎన్‌ మూర్తి, ఎ.రాజ్యలక్ష్మి, ఎం.వేణు పాల్గొన్నారు.

 

➡️