మహిళా పక్షపాతి జగన్‌

మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు దశల్లో స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ పూర్తిచేసి మహిళా పక్షపాతిగా

ఆమదాలవలస : నమూనా చెక్కును పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు దశల్లో స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ పూర్తిచేసి మహిళా పక్షపాతిగా జగన్మోహన్‌రెడ్డి సుస్థిరస్థానం సంపాదించు కున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన నియోజకవర్గస్థాయి వైఎస్‌ఆర్‌ ఆసరా నిధుల విడుదల, పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను శతశాతం పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. సంక్షేమ పథకాలను మహిళలకే కేటాయిస్తూ మహిళలకు తగిన గౌరవాన్ని కల్పించారన్నారు. పాలనలో పారదర్శక విధానాలతో దేశానికే ఆదర్శవంతమైన పాలనను కొనసాగిస్తున్న జగన్మోహనరెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని మహిళలను కోరారు. ఆసరాలో భాగంగా నియోజకవర్గానికి నాలుగో విడతలో రూ.30.74 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ముందుగా జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆసరా నిధుల నమూనా చెక్కును మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌, డిఆర్‌డిఎ పిడి డి.విద్యాసాగర్‌, మెప్మా పిడి ఎం.కిరణ్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, వైసిపి నాయకులు కెవిజి.సత్యనారాయణ, బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌, గురుగుబెల్లి శ్రీనివాసరావు, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాల నాయకులు, ఎంపిడిఒలు, వెలుగు, మెప్మా ఎపిఎంలు, సిసిలు, సిఒలు, ఆర్‌పిలు, సిఎఫ్‌లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : పట్టణంలోని వైఎస్‌ఆర్‌ టూరిజం పార్కులో వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత నమూనా చెక్కును జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పడ నారాయణమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు భారతీదివ్య, లాభాల స్వర్ణమని, టౌన్‌ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌ పట్నాయక్‌, జెసిఎస్‌ మండల అధ్యక్షులు ఆశి పురుషోత్తం పాల్గొన్నారు.

 

➡️