మాజీ సైనికుల సంక్షేమానికి కృషి

దేశ రక్షణ రంగమైన త్రివిధ దళాల్లో విధులు నిర్వర్తించి, దేశ సరిహద్దులను అనునిత్యం కాపాడిన

మాజీ సైనికులతో మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

దేశ రక్షణ రంగమైన త్రివిధ దళాల్లో విధులు నిర్వర్తించి, దేశ సరిహద్దులను అనునిత్యం కాపాడిన మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఈ మేరకు తనవంతుగా విశ్రాంత సైనికుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలో ఉన్న విశ్రాంత సైనికుల జిల్లా సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘం భవనం ఆధునికీకరణకు ఎంపీ ల్యాండ్స్‌ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజను ఆదేశించారు. అలాగే నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేషుతో ఫోన్లో మాట్లాడారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో సైనిక సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్‌ ఈశ్వరరావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావులు హాజరై తమ సమస్యలను వివరించారు. మాజీ సైనికులు కోరిన వెంటనే భవనం ఆధునికీకరణకు నిధులు కేటాయించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

 

➡️