మానవ అక్రమ రవాణాపై చర్యలు

జిల్లాలో మానవ అక్రమ రవాణాను, వెట్టిచాకిరిలను అరిట్టేందుకు కఠిన చర్యలు తప్పవని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

పుస్తకాన్ని అందజేస్తున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో మానవ అక్రమ రవాణాను, వెట్టిచాకిరిలను అరిట్టేందుకు కఠిన చర్యలు తప్పవని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన న్యాయ సేవా సదన్‌లో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల సంరక్షణ, 18 ఏళ్ల వయసు వరకు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చదువకోవాల్సిన వయసులో పనిలోకి పంపడం, వారిని చేర్చుకోవడం నేరమని అన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం పిల్లలు అర్ధాంరంగా చదువును ఆపేసి పనుల్లో చేరుతున్నారన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు మాట్లాడుతూ మహిళల సంరక్షణపై, బాలల సంరక్షణపై ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కె.వి.రమణ పాల్గొన్నారు.

 

➡️