మిల్లర్లా… దళారులా.?

రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని, తేమశాతం పేరుతో అదనంగా రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా

అధికారులను నిలదీస్తున్న సాయికృష్ణ

ప్రజాశక్తి- పలాస

రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని, తేమశాతం పేరుతో అదనంగా రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారని, వీరు మిల్లర్లా, దళారులా అంటూ ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, వైస్‌ ఎంపిపి తలగాన శ్రీరాములు, దువ్వాడ రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపిపిఉంగ ప్రవీణ అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ, పెదంచల సర్పంచ్‌ వరిశ రామారావు మాట్లాడుతూ పంటలు పండక, సాగునీరు అందక పంటలు నాశనమైందని, మరోవైపు మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నరని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్తుంటే రోజుల తరబడి బస్తాలను అన్‌లోడ్‌ చేయకపోవడంతో అదనంగా ట్రాక్టర్లుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని దీనిపై రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై వ్యవసాయ శాఖ ఎఒ పోలారావు, సివిల్‌ సఫ్లై డిటి రవికుమార్‌ మాట్లాడుతూ అదనంగా ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటే మా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండల సమావేశానికి హౌసింగ్‌ ఎఇ హాజరు కావడం లేదని, అయినా హౌసింగ్‌ ఎఇపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బొడ్డపాడు సర్పంచ్‌ తామడ మధన్‌ అధికారులను ప్రశ్నించారు. హౌసింగ్‌ ఎఇ వచ్చేవరకు సమీక్ష చేయవద్దని సభ్యులు స్పష్టం చేశారు. తర్లకోట సర్పంచ్‌ కొర్ల సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీలో ముగ్గురు ఆశావర్కర్లు ఉన్నా ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారని, మరో ఆశావర్కర్‌ పని చేయడం లేదని చెబుతున్నా ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రెంటికోట వైద్యాధికారి సునీల్‌ కుమార్‌ను నిలదీశారు. రూ.3.32 కోట్లుతో బడ్జెట్‌ ఆమోదించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎల్‌ మధుసూదనరావు, ఎంపిడిఒ ఎన్‌ రమేష్‌ నాయుడు, జెడ్‌పిటిసి మచ్చ రత్నాలమ్మ, మండలస్థాయి అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. అధికారులను నిలదీస్తున్న సాయికృష్ణమిల్లర్లా… దళారులా.?ప్రజాశక్తి- పలాసరైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని, తేమశాతం పేరుతో అదనంగా రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారని, వీరు మిల్లర్లా, దళారులా అంటూ ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, వైస్‌ ఎంపిపి తలగాన శ్రీరాములు, దువ్వాడ రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపిపిఉంగ ప్రవీణ అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ, పెదంచల సర్పంచ్‌ వరిశ రామారావు మాట్లాడుతూ పంటలు పండక, సాగునీరు అందక పంటలు నాశనమైందని, మరోవైపు మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నరని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్తుంటే రోజుల తరబడి బస్తాలను అన్‌లోడ్‌ చేయకపోవడంతో అదనంగా ట్రాక్టర్లుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని దీనిపై రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై వ్యవసాయ శాఖ ఎఒ పోలారావు, సివిల్‌ సఫ్లై డిటి రవికుమార్‌ మాట్లాడుతూ అదనంగా ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటే మా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండల సమావేశానికి హౌసింగ్‌ ఎఇ హాజరు కావడం లేదని, అయినా హౌసింగ్‌ ఎఇపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బొడ్డపాడు సర్పంచ్‌ తామడ మధన్‌ అధికారులను ప్రశ్నించారు. హౌసింగ్‌ ఎఇ వచ్చేవరకు సమీక్ష చేయవద్దని సభ్యులు స్పష్టం చేశారు. తర్లకోట సర్పంచ్‌ కొర్ల సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీలో ముగ్గురు ఆశావర్కర్లు ఉన్నా ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారని, మరో ఆశావర్కర్‌ పని చేయడం లేదని చెబుతున్నా ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రెంటికోట వైద్యాధికారి సునీల్‌ కుమార్‌ను నిలదీశారు. రూ.3.32 కోట్లుతో బడ్జెట్‌ ఆమోదించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎల్‌ మధుసూదనరావు, ఎంపిడిఒ ఎన్‌ రమేష్‌ నాయుడు, జెడ్‌పిటిసి మచ్చ రత్నాలమ్మ, మండలస్థాయి అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

 

➡️