ముందస్తు సంక్రాంతి సంబరాలు

కవిటి కళ్యాణి ఆంగ్ల పాఠశాల, ఎస్విజె విద్యా సంస్థల్లో సోమవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కరస్పాండెంట్లు

టెక్కలి : వేషధారణలతో ఓక్లాండ్‌ విద్యార్థులు

ప్రజాశక్తి- కవిటి

కవిటి కళ్యాణి ఆంగ్ల పాఠశాల, ఎస్విజె విద్యా సంస్థల్లో సోమవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కరస్పాండెంట్లు లోళ్ల రాజేష్‌, బి.వి.వి.ప్రసాదరావు బోగి మంటలు ముట్టించి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భం గా చిన్నారులు వేసిన రంగవల్లికలు, వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్‌ బల్లెడ రమేష్‌, ప్రిన్సిపాళ్లు బిందుమాధవి, బి.జగ్గారావు, పండి సత్యనారాయణ, మరిడి భాస్కరరావు, ఎఒలు బల్లెడ రాణి, జోష్‌ పాల్గొన్నారు.కోటబొమ్మాళి: మండలంలోని హరిశ్చంద్రపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నూక లక్ష్మణరావు ఆధ్వర్యాన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ముగ్గులు, బోగి మంటలు వేసి, పిండి వంటలు తయారు చేసి సంక్రాంతి పండగను ముందస్తుగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రాదా య దుస్తులు ధరించి గొబ్బెమ్మల పాటలు, తప్పెడుగుళ్లు, ఆటలతో చేసిన నృత్యం పలువురుని ఆలరించింది. ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురుషోత్తంపురం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం వై.లత, ఈదుపురం ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం బి.రామారావుల ఆధ్వర్యాన ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలపై అవగాహన కల్పించారు. కొత్తూరు : మండలంలోని సిరుసువాడ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు సందర్భంగా భోగి మంటలు వేశారు. అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు కె.గున్నమ్మ విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎం.లోకేష్‌, వై.సత్యనారాయణ, కె.భవానీ, వాలంటీర్‌ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. పలాస : కాశీబుగ్గ సాయి శిరీష ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముందుగా విద్యార్ధులతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. భోగి మంటల్లో భోగి పళ్లు వేశారు. అనంతరం విద్యార్థులకు క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్‌ కవిటి భారతి నగదు బహుమతి అందజేశారు. అలాగే మండలంలోని పెదంచల ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్‌ ఆర్మీ, హై స్కూల్‌ హెచ్‌ఎం మురళీకృష్ణ నాయుడు ఆధ్వర్యాన ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులతో భోగి మంటలు వేచి గ్రీన్‌ ఆర్మీ వారితో మొక్కలను నాటారు. కార్యక్రమంలో గ్రీన్‌ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్‌, ఉపాధ్యాయులు కె.ప్రసాదరావు, హెచ్‌.వెంకటరావు, బి.వి.ఎన్‌.మూర్తి, రామకృష్ణ, మాధవరావు, కె.రవిబాబు, వెంకటేష్‌ పట్నాయక్‌, కె.లత, ఎం.జ్యోతి, గ్రీన్‌ ఆర్మీ సభ్యులు బి.శిరీష పాల్గొన్నారు. బ్రాహ్మణతర్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముగ్గుల పోటీలు నిర్వహించి భోగి మంటలు వేశారు. కోలాటం, జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొర్ల వైకుంఠరావు పాల్గొన్నారు. పొందూరు : మండలంలోని మజ్జిలిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వి.వి.సత్యనారాయణ ఆధ్వర్యాన ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బమ్మలు, భోగి మంటలు, కోలాటం, హరిదాస్‌ కీర్తనలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధరించిన సంప్రదాయ వస్త్రాలు అలరించారు. అలాగే నాగలి పట్టిన రైతు వేషధారణతో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే స్థానిక మానస వేణి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్‌ ఎంఆర్‌ఆర్సిహెచ్‌ కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే స్థానిక శ్రీవేద పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వివిధ వేషధారణలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ బి.బాబూరావు, కరస్పాండెంట్‌ బి.సునీత, ప్రిన్సిపాల్‌ ఎన్‌.రామకృష్ణ పాల్గొన్నారు. టెక్కలి : మండలంలోని పోలవరం జిల్లా పరిషత్‌లో హెచ్‌ఎం పి.విలియం, స్థానిక రవీంధ్రభారతిలో ప్రిన్సిపాల్‌ ఎం.పద్మజ, స్థానిక ఓక్లాండ్‌ ఆంతర్జాతీయ పాఠశాలల్లో ప్రిన్సిపాల్‌ మధులత ఆధ్వర్యాన ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో గంగిరెద్దు ఆటలు, గాలిపటాలు ఎగురవేతలు, కోలాటం వంటి ప్రదర్శనలు, విద్యార్థుల వేషధారణలు పలువురుని ఆలరించాయి. భోగి మంటలు వేశారు. ముగ్గుల పోటీలను నిర్వహించారు. సోంపేట: పట్టణంలోని మహర్షి విద్యానికేతన్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాప్రదాయ వస్త్రధారణతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వేసి దాని ప్రత్యేకతను తెలియజేశారు. రంగవల్లుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలను అందజేశారు. రణస్థలం : స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.శ్రీధర్‌ ఆధ్వర్యాన ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులందరూ ముద్దులోలికే సంప్రదాయ దుస్తులతో, సంక్రాంతి స్వాగత రంగవల్లులతో, భోగి మంటలతో, గాలిప టాలతో, కుర్రకారు ఈలలతో సందడి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.కృష్ణ, ప్రసాద్‌, లక్ష్మణరావు, బాలామణి, స్రవంతి, మాలతి, పర్వీన్‌, ఉదయకుమారి పాల్గొన్నారు. లావేరు: మండలంలో లక్ష్మీపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు. చిన్నారుల హరిదాసు, పల్లెటూరి సాంప్రదా య దుస్తుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. వసంత లక్ష్మి సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

➡️