ముగ్గుల పోటీలు

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మండలం గోరింట గ్రామంలో అవినాష్‌ సావే ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో

వజ్రపుకొత్తూరు : ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

ప్రజాశక్తి- పొందూరు

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మండలం గోరింట గ్రామంలో అవినాష్‌ సావే ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఫౌండేషన్‌ చైర్మన్‌, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయుకులు కూన వెంకటరావు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఆటో ట్రికల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చింతాడ సింహాచలం ఆర్థికసాయంతో ముగ్గుల పోటీలు విజేతలకు గోరింట సర్పంచ్‌ చింతాడ శ్రీలక్ష్మీ, ఆటోట్రికల్‌ డైరెక్టర్‌ చింతాడ సింహాచలం, మాజీ సర్పంచ్‌, ఆముదాలవలస నియోజకవర్గ టిడిపి బిసిసెల్‌ అధ్యక్షులు చింతాడ కృష్ణ వాసుదేవరావు, గ్రేహౌండ్స్‌ డిఎస్‌పి బాడాన సోమయ్య, ట్రస్టు కార్యదర్శి దుంపల మృదుల, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ అమ్మన్నాయుడు చేతులు మీదుగా బహుమతులు అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినాష్‌ ఫౌండేషన్‌ తరుపున కూన వెంకటరావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కూన శ్రీలేఖకు రూ.2వేలు, రెండవ బహుమతి చింతాడ చంద్రకళకు రూ.1500లు, మూడవ బహుమతి కె. కళ్యాణికి రూ.1000 అందజేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 36 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేసారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చింతాడ మంగమ్మ, బాడాన మౌనికలు వ్యవహరించారు.వజ్రపుకొత్తూరు: సాంప్రదాయాలను యువత పాటించాలని ఉద్దానం అభ్యుదయ సేవాసమితి అధ్యక్షుడు తమాడ లక్ష్మణరావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా సోమవారం రాత్రి ఉద్దానం అభ్యుదయ సేవాసమితి ఆధ్వర్యంలో కొమరల్తాడలో నిర్వహించిన ముగ్గులు పోటీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు, సభ్యులు మండల మహేష్‌, మండల రాము, దండుపాటి పాపారావు, చింత మహేష్‌, కొంకి మోహిని పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌: స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రధమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలుచ తృతీయ బహుమతి రూ.3 వేలు అందించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు వెయ్యి రూపాయలు, ఒక చీర పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొండెలి సుజాత, వైస్‌ ఎంపిపిలు పేడాడ రమేష్‌, మన్నెల కిషోర్‌, ఎంపిటిసి పీత హేమలత, వారణాసి గోవిందరావు, రవికుమార్‌, హనుమంతు వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు కింతల తిరుమల కుమార్‌ పాల్గొన్నారు.

 

➡️