మున్సిపల్‌ కార్మికుల ముట్టడి

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు గడచిన 12 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మెలో భాగంగా

తేజేశ్వరరావు, బలరాంలను అరెస్టు చేస్తున్న పోలీసులు

నగరంలో 79 మంది అరెస్టు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు గడచిన 12 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మెలో భాగంగా శనివారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులను లోనికి రానీయకుండా అడ్డుకున్నారు. గంటసేపు పనులను స్తంభింపజేశారు. ముట్టడిని భగం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పెద్దఎత్తున కార్మికలు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.బలరాం, ఎ.గణేష్‌తో పాటు 79 మున్సిపల్‌ కార్మికులను అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద వారు మాట్లాడారురు. పాదయాత్ర, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని సిఎం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలన్నారు. అరెస్టులు నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కళ్యాణరాజు, డి.యుగంధర్‌, ధనాలు చిట్టి, అరుగుల రాము, ఎ.శేఖర్‌, ఎ.గణేష్‌, జె.రమేష్‌, బి.సరోజ, జె.మాధవి, ఎం.పార్వతి, ఎ.శారద, టి.వెంకటలక్ష్మి, ఎ.లక్ష్మి, కె.భాగ్య, ఎన్‌.లలిత పాల్గొన్నారు. పలాస : మున్సిపల్‌ కార్యాలయం గేటు వద్ద పారిశుధ్య కార్మికులు చేపడుతున్న ధర్నా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులను పారిశుధ్య కార్మికులు చుట్టూ ముట్టారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు ధర్నా చేపట్టారు. కార్యాలయానికి రెండు వైపులా ఉన్న గేట్లుకు తాళాలు వేసి అధికారులు కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ మధు, పోలీస్‌ సిబ్బంది మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా విరమించి కార్యాలయం తాళాలు తెరిచి అధికారులకు కార్యాలయానికి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పారిశుధ్య కార్మికులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలిసులు ముందుకొచ్చి అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, ఒక్కసారిగా కార్మికులు పోలీసులను చుట్టుముట్టారు. 11 గంటల వరకు ధర్నా చేసేందుకు అవకాశం కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, సిపిఐ నాయకులు చాపర వేణుగోపాల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, ఎస్‌ఐ మధుసూదనరావును కోరారు. దీంతో పోలీసులు అరెస్టు చేయకుండా విరమించుకున్నారు. ధర్నాకు సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు తామడ సన్యాసిరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, యూనియన్‌ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురగన్‌, యం.రవి, యూనియన్‌ నాయకులు దివాకర్‌, యస్‌.శంకర్‌, తిరుపతి, ప్రకాష్‌ముఖి, సీతమ్మ, గులాబీ, సావిత్రి, లక్ష్మి పాల్గొన్నారు. ఆమదాలవలస : పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్థనరావు అన్నారు. మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకుడు తాడి సంతోష్‌, కె.తారకేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, జె.శ్రీను పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : సిఐటియు జిల్లా కార్యదర్శి కార్యదర్శి లక్ష్మీనారాయణ మున్సిపల్‌ కార్యాలయ వద్ద కార్మికులు బైఠాయించారు. కార్యక్రమంలో సిఐటియు కన్వీనర్‌ రమేష్‌కుమార్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

 

➡️