మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న కృష్ణమూర్తి పక్కన రామకృష్ణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తితో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా కార్మికులకు సంఘీబావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ముక్యమంత్రి తన బాధ్యతలను విస్మరించారని విమర్శించారు. న్యాయం చేయాలని అడిగితే ఎస్మా చట్టం, ఉద్యోగులపై పోలీసుల దౌర్జన్యం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా మీ పాలనలో జరిగేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అరుగులు గణేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, పార్టీ నాయకులు చాపర సుందర్‌లాల్‌, యూనియన్‌ నాయకులు కళ్యాణ రాజు, ఎ.శంకరరావు, అర్జీ రాము, ఎ.రాజేష్‌, టి.వెంకటలక్ష్మి, టి.మల్లమ్మ, జె.మాధవి, ఎ.మోహన్‌, డి.యుగంధర్‌, ఎం.నారాయణరావు, ఎం.అప్పన్న పాల్గొన్నారు. ఆమదాలవలస: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మిక నాయకుడు తాడి సంతోష్‌ అన్నారు. బుధవారం పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకున్న సందర్బంగా మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు, పాదయాత్రలోనూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో రెగ్యులర్‌ చేసి సమాన పనికి సమానం వేతనం చెల్లిస్తామన్నారని, నేటికీ అమలు చేయలేదని అన్నారు. పారిశుధ్య కార్మికులు కె.తారకేశ్వరావు, కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: ఎన్నికల ముందు పారిశుద్ధ్య కార్మికులు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మె 15వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారుపలాస: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు బుధవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం 16వ రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, శ్రీనివాస రావు, యూనియన్‌ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురగన్‌, ఎం.రవి, నాయకులు దివాకర్‌, ఎస్‌.శంకర్‌, తిరుపతి, ప్రకాష్‌ ముఖి, సీతమ్మ, గులాబీ, లక్ష్మి పాల్గొన్నారు.

 

➡️