మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిస్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మె సోమవారం కొనసాగింది. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా శిబిరాన్ని ఎపి మున్సిపల్‌వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కొనసాగించారు. శిబిరంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల

ఆమదాలవలస : మోకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న కార్మికులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిస్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మె సోమవారం కొనసాగింది. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా శిబిరాన్ని ఎపి మున్సిపల్‌వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కొనసాగించారు. శిబిరంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాంలు కార్మికులనుద్దేశిం చి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రత్నామ్నాయ పద్దతులు అవలంభిస్తూ సమ్మెను నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్మికులందరిని పర్మినెంట్‌ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జీవో నెంబర్‌ ఏడు ప్రకారం క్లాప్‌ ఆటోలో డ్రైవర్లకు నెలకు రూ. 18,500 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ శిబిరంలో యూనియన్‌ నాయకులు కళ్యాణ రాజు, అర్‌జి రాము, ఎ.రాజేష్‌, జె.మాధవి, టి.వెంకటలక్ష్మి, ఎ.మోహన్‌, డి.యుగంధర్‌, ఎం.నారాయణరావు, అప్పన్న, డి.సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.ఆమదాలవలస: పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకోవడంతో మోకాళ్ళపై నిల్చొని విన్నుతనంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మిక నాయకులు తాడి సంతోష్‌, తారకేశ్వరరావు, జె.శ్రీను పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం ఒంటి కాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి పట్టించుకోవడం లేదని, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రమేష్‌కుమార్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పలాస : ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఏడో రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు కాశీబుగ్గ గాంధీ విగ్రహం మూడు రోడ్ల జంక్షన్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురగన్‌, ఎం.రవి, దివాకర్‌, ఎస్‌.శంకర్‌, తిరుపతి, ప్రకాష్‌ ముఖి, సీతమ్మ, గులాబీ, సావిత్రి, లక్ష్మి పాల్గొన్నారు.

 

➡️