యాంత్రీకరణతో అధిక దిగుబడులు

యాంత్రికరణతో వరిసాగులో అధిక దిగుబడులు సాధించవచ్చునని

యాంత్రీకరణపై రైతులకు వివరిస్తున్న శాస్త్రవేత్త నీలవేణి

ప్రజాశక్తి- ఆమదాలవలస

యాంత్రికరణతో వరిసాగులో అధిక దిగుబడులు సాధించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కృషివిజ్ఞాన కేంద్రంలో ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ యాంత్రీకరణపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరిసాగులో యాంత్రికరణ, ఇతర పంటల్లో యాంత్రీకరణపై యువ రైతులకు శిక్షణ ఇచ్చారు. సస్యసేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నేల తయారీ యంత్రాలు, విత్తనం, ఎరువు ఒకేసారి వేసే యంత్రాలపై వివరించారు. అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వెంకటరావు మాట్లాడుతూ వ్యవసాయంలో ఉపయోగాలపై రైతులకు వివరించారు. వరి నాట్లు నేల యంత్రం ఉపయోగాలు, ఇతర యంత్రాల ఉపయోగాలను విస్తరణఫ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.నీలవేణి తెలియజేస్తూ ట్రే ఫిల్లింగ్‌ చేయటాన్ని నైపుణ్యత కలిగిన రైతులతో సాధన చేయించారు. అదేవిధంగా డ్రోన్‌ సహాయంతో వ్యవసాయ మందుల పిచికారిని సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.అనూష తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

 

➡️