యువగళానికి తరలివెళ్లిన టిడిపి శ్రేణులు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద నిర్వహించిన యువగళం ముగింపు సభకు టీడీపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ జెండా ఊపి వాహన శ్రేణి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపాలిటీ, మండలంలోని పలు గ్రామాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న రవికుమార్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద నిర్వహించిన యువగళం ముగింపు సభకు టీడీపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ జెండా ఊపి వాహన శ్రేణి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపాలిటీ, మండలంలోని పలు గ్రామాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ బహిరంగసభకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరుకానుండడంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ సభకు బయలుదేరి వెళ్లారు. కొత్తరోడ్డు, చింతాడ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీతో కొంతసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు నూక రాజు, సనపల ఢిల్లేశ్వరరావు, అన్నెపు భాస్కరరావు, శివ్వాల సూర్యం, బోర గోవిందరావు, బొడ్డేపల్లి గౌరీపతిరావు పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్‌: టిడిపి ఆధ్వర్యాన విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నిర్వహించిన యువగళం సభకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో టిడిపి శ్రేణులు తరలివెళ్లారు. నగరంలో అరసవల్లి నుంచి మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యాన పెద్దసంఖ్యలో వాహనాలతో బయలు దేరారు. నగరంలో కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు బారులు తీరాయి. ఈ ర్యాలీలో నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, జామి భీమశంకర్‌, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, విభూది సూరిబాబు, జల్లు రాజీవ్‌, నాయకులు పాల్గొన్నారు.

కోటబొమ్మాళి: విజయనగరం జిల్లా పోలుపల్లి వద్ద నిర్వహించిన యువగళం, నవశకం బహిరంగ సభకు కోటబొమ్మాళి నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలి వెళ్లారు. సుమారు 150 వాహనాల్లో టెక్కలి నియోజవర్గం నలుమూలల నుంచి కార్య కర్తల అభిమానులు, నేతలు బయలుదేరి వెళ్లారు.

 

➡️