యువ సేవా సంఘం ఆర్థికసాయం

మండలంలోని కోష్ట పంచాయతీ పల్లిపేట శ్రీరామ యువ సేవా సంఘం సభ్యులు

నగదును అందజేస్తున్న సంఘ సభ్యులు

ప్రజాశక్తి- రణస్థలం రూరల్‌

మండలంలోని కోష్ట పంచాయతీ పల్లిపేట శ్రీరామ యువ సేవా సంఘం సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికసాయం ఆదివారం చేపట్టారు. వల్లభరావు గ్రామానికి చెందిన కొప్పల రాము, కుటుంబ సభ్యులు ఇటీవల వత్సవలస జాతరకు వెళ్తుండగా కుటుంబసభ్యులందరూ ప్రమాదానికి గురై ప్రస్తుతం విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాము కుటుంబ సభ్యులకు రూ. 55 వేలు ఆర్ధికసాయం అందించారు. అలాగే కోష్టకి చెందిన ఎడ్ల జగ్గునాయుడు కిడ్నీల సమస్యతో బాధపడుతుండడంతో రూ.10 వేలు అందించారు. దువ్వాన పేటకు చెందిన ఎరుకొండ జగదీష్‌ ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతుండడంతో రూ. 10 వేలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌వైఎస్‌ అధ్యక్షులు పల్లె పాపరాజు, ఉపాధ్యక్షులు పిసిని శ్రీనివాసరావు, కోశాధికారి పల్లె రమేష్‌, సంఘ సభ్యులు పల్లె మహేష్‌, పిసిని సత్యం పాల్గొన్నారు.

 

➡️