రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలి

మిచౌంగ్‌ తుపాను కారణంగా

కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి.రమణ

ప్రజాశక్తి – జి.సిగడాం

మిచౌంగ్‌ తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎపి కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని బాతువలో రైతులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో దళారుల హవా సాగుతుందన్నారు. తేమ శాతం తగ్గిందని 3, 4 కేజీలు అదనంగా తీసుకుంటున్నారని తెలిపారు. ధాన్యం డబ్బులతో పాటు కూలీలు, సంచుల ఖర్చులూ వేయాలని డిమాండ్‌ చేశారు. తోటపల్లి కాలువ పూడికలు తీయకపోవడంతో రైతులకు సాగునీరందడం లేదని తెలిపారు. పూడికలు తీయించాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టి.మోహనరంగా, ఎం.అసిరినాయుడు, పి.రమణ, టి.అప్పలనాయుడు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న రమణ

➡️