రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పిలుపునిచ్చారు. నగరంలోని కృష్ణాపార్కు వద్ద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పిలుపునిచ్చారు. నగరంలోని కృష్ణాపార్కు వద్ద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సామాజిక బాద్యతగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సుదీర్ఘకాలం వ్యాధిగ్రస్తులైన వారికి క్రమం తప్పకుండా రక్తం అవసరమవుతూ ఉటుందన్నారు. బ్లడ్‌ బ్యాంకుల్లో తగిన రక్త నిల్వలు ఉండేలా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. రక్తదాన శిబిరాలు విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా రక్తదాన విశిష్టతను ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం పెంచాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. ఆరోగ్యమైన వ్యక్తి 65 ఏళ్ల వరకు మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చని చెప్పారు. రక్తాన్ని దానం చేయడం వల్ల రక్తదాతలకూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయన్నారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొందాం, ఇతరులకు సాయంగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదాతలకు మెమోంటో, సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో డిపిఆర్‌ఒ కె.బాలమాన్‌ సింగ్‌, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, సభ్యులు పి.శ్రీకాంత్‌, చైతన్య, బ్యాంకు మేనేజర్‌ ఎ.శేఖర్‌, క్లస్టర్‌ హెడ్‌ నర్రా ప్రసాద్‌, యూనిట్‌ హెడ్‌ శశిధర్‌, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️