రక్షణ చట్టంపై అవగాహన అవసరం

వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన అవసరమని, తద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని వినియోగదారుల జిల్లా కమిషన్‌ సభ్యులు జి.రాధారాణి పేర్కొన్నారు. ఎచ్చెర్లలోని అంబేద్కర్‌ గురుకులంలో ప్రిన్సిపాల్‌ బి.లక్ష్మి అధ్యక్షతన

కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న రాధారాణి

వినియోగదారుల కమిషన్‌ సభ్యులు రాధారాణి

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన అవసరమని, తద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని వినియోగదారుల జిల్లా కమిషన్‌ సభ్యులు జి.రాధారాణి పేర్కొన్నారు. ఎచ్చెర్లలోని అంబేద్కర్‌ గురుకులంలో ప్రిన్సిపాల్‌ బి.లక్ష్మి అధ్యక్షతన ఆశ్రా (అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ అవేర్నెస్‌) సంస్థ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాల దశ నుంచే అవగాహన కలిగి ఉంటే పిల్లలు ఉత్తమ స్థాయి వినియోగదారులు అవుతారని అన్నారు. తద్వారా దేశ సంపదను పెంచగలుగుతారని అన్నారు. వారిద్వారా స్వచ్ఛమైన ఆర్థిక సమాజం ఏర్పడు తుందని, వారి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజమూ ప్రభావితం అవుతుందని పేర్కొన్నా రు. తమ హక్కులు ఎలా వినియోగించుకోవాలో కూడా వివరించారు. వినియోగదారులకు హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయని, వాటిని సక్రమంగా పాటించాలని అన్నారు. సీనియర్‌ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్‌ వినియోగదారుల చట్టం 2019గురించి వివరించారు. అనంతరం నూతన కేలండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆశ్రా జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ గంజి ఎజ్రా, సభ్యులు లఖినాన రవికుమార్‌, కట్టా. పార్థసారథి, ఉపాధ్యాయులు జ్యోతిశ్రీ, యశోద, ప్రతిభ, ఉమాగౌరీ, ఉదయిని, భ్రమరాంబ తదిరులు పాల్గొన్నారు.

 

➡️