రేపట్నుంచి జాతీయస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు

జాతీయస్థాయి టెన్నికాయిట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు పలాస ప్రభుత్వ ఉన్నత

హాజరు కానున్న 23 రాష్ట్రాల క్రీడాకారులు

ప్రజాశక్తి – పలాస

జాతీయస్థాయి టెన్నికాయిట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా నిలిచింది. రాష్ట్ర టెన్నికాయిట్‌ సంఘం ఆధ్వర్యాన ఈనెల తొమ్మిది నుంచి 13వ తేదీ వరకు సీనియర్‌ జాతీయ టెన్నికాయిట్‌ ఛాంపియన్‌షిప్‌ (పురుషులు, మహిళలు) పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు 23 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరు కానున్నారు. పురుషులు పలాస మదర్‌ థెరిసా పాఠశాలలో, మహిళలు ఎంజెపి పాఠశాలలో, రిఫరీలు స్థానిక ఉన్నత పాఠశాలలో ఉండేందుకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల జట్లు చేరుకొని సాధన కూడా మొదలుపెట్టాయి.మైదానంలో ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు కార్యనిర్వాహక కార్యదర్శిగా పి.తవిటయ్య వ్యవహరించనున్నారు. జాతీయస్థాయి పోటీలు నిర్వహించనున్న పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం పలుమార్లు రాష్ట్ర పోటీలకు వేదికగా నిలిచింది. ఇదివరకు కబడ్డీ, వాలీబాల్‌, యోగా, వెయిట్‌ లిఫ్టింగ్‌, టెన్నికాయిట్‌, చెస్‌, అథ్లెటిక్స్‌ అంశాల్లో ఇక్కడ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు. జాతీయస్థాయి పోటీలకు పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిక కావడం ఆనందంగా ఉందని కార్యనిర్వాహక కార్యదర్శి పి.తవిటయ్య అన్నారు.

➡️