రైతులకు నష్టపరిహారం అందజేయాలి

మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా వరి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకుడు బమ్మిడి ఆనందరావు, మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావులు డిమాండ్‌ చేశారు. మండలంలోని నగరంపల్లి, పూండిగల్లి గ్రామాల్లో దెబ్బతిన్న

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా వరి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకుడు బమ్మిడి ఆనందరావు, మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావులు డిమాండ్‌ చేశారు. మండలంలోని నగరంపల్లి, పూండిగల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను రైతులతో గురువారం పరిశీలించారు. నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షానికి కోసిన వరి పంటతో పాటు కుప్పలు తడిపిపోయి రైతులకు నష్టం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా పొలం సాగు చేయడానికి రైతులకు రూ.30 వేలు వరకు ఖర్చు అయిందన్నారు. కనీసం ఈ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సుమారు 70 రోజుల పాటు వర్షాలు లేక, శివారు భూములకు వంశధార నీరు అందకపోవడంతో వేసి పంట ఎండిపోయిందని అన్నారు. ఉన్నవి గెడ్డలు, వాగుల్లో ఆయిల్‌ ఇంజిన్లతో నీరు తోడుకొని పంట పండిస్తే వర్షం రూపంలో నష్టం జరిగి నిరాశ మిగిల్చిందన్నారు.కౌలు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బమ్మిడి రామకృష్ణ, ఎన్‌.చంద్రయ్య, ఎన్‌. జోగారావు, బి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

➡️