లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎం.ప్రసాదరావు అన్నారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం

పలాస : అవగాహన కల్పిస్తున్న ప్రసాదరావు

ప్రజాశక్తి- పలాస

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎం.ప్రసాదరావు అన్నారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద బుధవారం లింగ నిర్ధారణ చట్టం అమలుపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడ మగ నిష్పత్తిని అందరూ బాధ్యతగా తీసుకొని తగ్గించాలని కోరారు. శారీరిక, మానసిక హింస చేయరాదన్నారు. సామాజిక కట్టుబాట్లు, రుగ్మతలు, మూఢనమ్మకాలు రూపుమాపి, స్కానింగ్‌ సెంటర్ల పర్యవేక్షణ అవసరమని అన్నారు. కార్యక్రమంలో జె.సూర్యనారాయణ, డాక్టర్‌ తమ్మినేని పాపినాయుడు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం.వెంకటరావు, డాక్టర్‌ బి.గౌతమి, డాక్టర్‌ దేవి, గ్రీన్‌ ఆర్మీ అధ్యక్షుడు బోనేల గోపాల్‌, డిపిఎంఒ వి.సురేష్‌కుమార్‌, డిఇఎంఒ వెంకటేశ్వర్లు, కో-ఆర్డినేటర్‌ సూర్యకళ, సూపర్‌వైజర్‌ ఎన్‌.ఋషికేశ్వరారావు, కె.సీతారామ్మూర్తి, ఎన్‌.సీతాదేవి, టి.నర్మద, ఆర్‌.జాస్మిన్‌కుమారి, గ్రీన్‌ ఆర్మీ సభ్యులు బెందాళ శివప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రసవాలు పెంచేలా కృషివజ్రపుకొత్తూరు: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు పెంచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ ప్రసాదరావు సూచించారు. మండలంలోని వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల తీరు తెన్నులను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అన్ని మందులు అందుబాటులో ఉండేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రారంభించిన ఆస్పత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు అంజలి, దేవి, డెప్యూటీ పారా మెడికల్‌ ఆఫీసర్‌ వాన సురేష్‌కుమార్‌, ఇఒ వెంకట్రావు, అనురాధ పాల్గొన్నారు.

 

➡️