వచ్చే నెలాఖరులోగా కంటి శస్త్రచికిత్సలు

జగనన్న ఆరోగ్య సురక్షలో కంటి

సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

  • జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జగనన్న ఆరోగ్య సురక్షలో కంటి ఆపరేషన్ల కోసం నమోదైన కేసులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఎన్‌జిఒ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇదివరకు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో నమోదైన కళ్లద్దాల పంపిణీ, కేటరాక్టు శస్త్రచికిత్సల కోసం కోసం నమోదైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా నమోదు చేసుకున్న వారికి కంటి ఆపరేషన్లు, కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని ఎన్‌జిఒ ప్రతినిధులను ఆదేశించారు. సమావేశంలో శంకర్‌ ఫౌండేషన్‌, జెమ్స్‌, ఆరోగ్యవరం ఆస్పత్రులకు సంబంధించిన ఎన్‌జిఒ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

➡️