వసతిగృహాల్లో పిల్లలకు పోషకాహారం

వసతిగృహాల్లో పిల్లలకు పోషకాహారం

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

వసతిగృహాల్లోని పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. నగరంలోని అరసవల్లిలోని బాలసదన్‌, శిశుగృహాలు గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా వారి ఆరోగ్య పరిస్థితి, ఆహారం, ఇతర మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు మంచి పోషకాహారం అందేలా చూడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలపై తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈయన వెంట బాలసదన్‌ సూపరింటెండెంట్‌ పుణ్యవతి, మ్యాట్రిన్‌ సుజాత, శిశుగృహ మేనేజర్‌ నరేష్‌, సోషల్‌ వర్కర్‌ రాంబాబు ఉన్నారు.

➡️