వాలంటీర్లపై కుట్ర తగదు

వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న

ప్రజాశక్తి- ఆమదాలవలస

వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలు తగవని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని స్వీకర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సుపరిపాలనే లక్ష్యంగా వాలంటీర్ల వ్యవస్థ ఆవిర్భవించిందని, అటువంటి వ్యవస్థపై ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. నిరు పేదలకు మేమున్నామంటూ అభయమిచ్చే వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వాలంటీర్లు నిర్వహిస్తున్న విధులకు దూరంగా ఉండేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో ప్రతిపక్ష పార్టీల కుట్ర పూరిత ఆలోచనలు దాగి ఉన్నాయని విమర్శించారు. వికలాంగు లకు, వృద్ధులకు అందాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.వాలెంటర్లపై అంతా కక్ష ఎందుకో? : మంత్రిపలాస : వాలంటీర్లపై చంద్రబాబు కక్ష సాధించడం వల్ల పింఛనుపైనే ఆధారపడి బతుకుతున్న అవ్వతాతా అవస్థలు పడతారని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస మంత్రి కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సచివాలాయాలు, వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేసి నేరుగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల మాజీ అధికారి నిమ్మగెడ్డ రమేష్‌ అనే వ్యక్తి ద్వారా వారిపై ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి మాజీ సిఎం చంద్రబాబు కోసం పని చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పదవీ విరమణ చేసిన తరువాత నిమ్మగెడ్డ ఒక సంస్థను పెటుకొని చంద్రబాబు కోసం పనిచేస్తుంటే వారికి కొంత మంది మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇంగ్లీష్‌ మీడియం చదువులు పెడితే పేదలు పేదలుగానే ఉండాలని, దానిపై కూడా కేసులు వేశారని అన్నారు. 14 ఏళ్ల పాలనలో పేదలకు సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు, జగన్‌ 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే దానిపైనా కోర్టుకు వెళ్లారన్నారు. సచివాలయ వ్యవస్థను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటే దానిపైనా కోర్టుకు వెళ్లారని, దమ్ముంటే ఆ వ్యవస్థను ఆపగలరా? అని ప్రశ్నిం చారు. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామంటే అమరావతిలో తమ సామాజిక తరగతిలో సామ్రాజ్యంలో ఉండాలని చంద్రబాబు పాకులాడుతు న్నారన్నారు. చంద్రబాబు వ్యవస్థలను అడ్డం ఎటుకొని ప్రజలకు జరగాల్సిన మంచిని దూరం చేస్తున్నారని ఆరోపిం చారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గడపగడపకు పథకాలు అందు తుంటే… చంద్రబాబు తటుకోలేక పోతు న్నారని అన్నారు. కోవిడ్‌ సమయంలో వాలంటీర్లు సేవలు అమోఘమని కొనియాడారు. చంద్రబాబు పాలనలో అవ్వతాతలు కిలోమీటర్లు పొడవునా నడిచివెళ్లి, జన్మభూమి కమిటీల ఎదుట మోకాళ్లపై నిలిచి ఉండేవారన్నారు. 14 ఏళ్ల కాలంలో ఒక్క మెడికల్‌ కాలేజి కూడా కట్టలేకపోవడం దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. నెలరోజుల్లో టిడిపి శాశ్వతంగా దూరం అయిపోతుందని, చంద్రబాబు, అండ్‌ ముఠాను రాష్ట్రం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు.

➡️