వికలాంగులకు వాహనాలు

స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సామజిక బాధ్యతలో భాగంగా మండలంలో ముగ్గురు వికలాంగులకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అభ్యర్థన మేరకు మూడు టివిఎస్‌ త్రీ మోటార్‌ చక్రాల స్కూటర్లును ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ చేతులమీదుగా అరబిందో

బైక్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి- రణస్థలం

స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సామజిక బాధ్యతలో భాగంగా మండలంలో ముగ్గురు వికలాంగులకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అభ్యర్థన మేరకు మూడు టివిఎస్‌ త్రీ మోటార్‌ చక్రాల స్కూటర్లును ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ చేతులమీదుగా అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ప్రతినిధులు సమక్షంలో ముగ్గురు వికలాంగులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ యాజమాన్యం నిత్యానంద రెడ్డి, శరత్‌ చంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి టొంపల సీతారాం, మండల జెసిఎస్‌ ఇన్‌ఛార్జి చిల్ల వెంకట్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి ప్రతినిధి మైలపల్లి కామరాజు, స్టేట్‌ అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కింతలి రమేష్‌ బాబు, ఎఫ్‌ఎస్‌సిఎస్‌ అధ్యక్షులు కిల్లారి రమణ, పాతర్ల పల్లి సర్పంచ్‌ గొర్లె రాధాకృష్ణ, కృష్ణాపురం సర్పంచ్‌ కంబపు రామిరెడ్డి, బుడుమూరు సర్పంచ్‌ ప్రతినిధిపెదనాయుని అప్పల నర్సు నాయుడు, నాయకులు కెల్ల రామకృష్ణ పాల్గొన్నారు.

బైక్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌

➡️