విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

మండలంలో మకరంపురం జెడ్‌పి ఉన్నత పాఠశాలలో బుధవారం 9వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

కోటబొమ్మాళి : విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న ఎంపిపితదితరులు

ప్రజాశక్తి- కంచిలి

మండలంలో మకరంపురం జెడ్‌పి ఉన్నత పాఠశాలలో బుధవారం 9వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఎంపిపి దేవదాస్‌ రెడ్డి చేతుల మీదుగా హెచ్‌ఎం బాబురావు, ఎంఇఒ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు ఆధునిక సాంకేతికత సైతం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సిఎం ఈ టాబ్‌లు పంపిణీ చేపట్టారన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయం, లడ్డు కేశవ పాత్రో, ఎంపిటిసి అప్పారావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.కోటబొమ్మాళి: విద్యార్ధులను గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తీస్తున్నారని ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు అన్నారు. బుధవారం మండలంలో చిన్నబమ్మిడి జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఎంఇఒ ఎస్‌.అప్పలరాజు ఆధ్వర్యంలో 8వతరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి వాన లక్ష్మి, అసిరినాయుడు, రాష్ట్ర కళింగ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, పేడాడ వెంకటరావు, వెంకటరమణమూర్తి, హెచ్‌ఎం భానుమూర్తి పాల్గొన్నారు.

 

➡️