వైద్యారోగ్యశాఖ ఎఒగా బాబూరావు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో

నియామకపత్రం అందజేస్తున్న మీనాక్షి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పరిపాలనాధికారిగా ఆర్‌.బాబూరావు నియమితులయ్యారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షిని బుధవారం కలిసి నియామకపత్రాన్ని అందుకున్నారు. ఆయన ఇప్పటి వరకు రిమ్స్‌ వైద్య కళాశాలలో సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఎఒగా నియమించింది. ఇక్కడ గతంలో ఎఒగా పనిచేసిన బాస్కర్‌ కుమార్‌ను ఇటీవల సస్పెండ్‌ చేశారు. ఆయన స్థానంలో బాబూరావు బాధ్యతలు చేపట్టారు.

 

➡️