వైద్యుల ఫిర్యాదుపై విచారణ

పొందూరు సామాజిక ఆస్పత్రి సూపరిెంటెండెంట్‌, జూనియర్‌

సిహెచ్‌సిలో విచారణ చేపడుతున్న వైద్యశాఖ అధికారులు

ప్రజాశక్తి- పొందూరు

పొందూరు సామాజిక ఆస్పత్రి సూపరిెంటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌పై ఆస్పత్రి వైద్యులు చేసిన ఫిర్యాదుపై శుక్రవారం రాజాం ఏరియా ఆస్పత్రి సిఎస్‌ఎస్‌జిఎం డా.ఎన్‌.కళ్యాణ్‌బాబు, ఎఒ కె.చంద్రశేఖర్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సూపరింటిండెంట్‌ రామదాసు, జూనియర్‌ అసిస్టెంట్‌ అనూష సమయపాలన పాటించకపోవడంతో పాటు హెచ్‌డిఎస్‌ నిధులతో అవసరమైన పరికరాలు కొనుగోలు చేయకుండా వారికి ఇష్టమైనవి కొనుగోలు చేసారని, దీంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ వైద్యాధికారులు సుజాత, ప్రియాంక, ప్రతిభలు వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబందించి ఇరువైపుల వారిని ప్రశ్నించడంతో పాటు, ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఇరువురు నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. విచారణకు సంబంధించిన నివేదికను వైద్యశాఖ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వారు తెలిపారు.

 

➡️