వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌ రేసులో రాజ్యలక్ష్మి!

ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌ రేసులో

రాజ్యలక్ష్మి

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌ రేసులో నెలకో పేరు మార్మోగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పలాస పర్యటన తర్వాత ఒక్కసారిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేర్లు వినిపిస్తు న్నాయి. అందులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి పేరు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహి స్తున్న పిరియా సాయిరాజ్‌ ఇవేవీ పట్టించుకోకుండా పార్టీ అప్పగించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలు విడువక నియోజకవర్గంలో కులాలు ప్రస్తావన తెరపై తీసుకొచ్చారు. దీంతో ఆశావహుల్లో యాదవ సామజిక తరగతికి ఎమ్మెల్సీ పదవి రావడంతో టిక్కెట్‌ రేసులో వెనుక పడినట్లేనని చెప్పారు. ఇక మిగిలిన ప్రధానమై రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన పిలక రాజ్యలక్ష్మి పేరు ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గోప్యంగా ఉండాలని పెద్దలు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ రాజ్యలక్ష్మి పేరు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. జిల్లాస్థాయి నాయకులు సాయిరాజ్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త పేర్లు తెరపైకి తెస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. మరో వైపు అధిష్టానం ఒక్కోసారి ఒక పేరు బయట పెడుతూ రహస్య సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి సర్వేలో అనుకూలంగా లేవు… అందుకే ఈ సారి ఎన్నికలో టిక్కెట్‌ ఫలానా వ్యక్తికి ఇవ్వాల్సి వస్తోందని స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోం ది. ఇచ్ఛాపురం టిక్కెట్‌ విషయం ముందుగా సాయిరాజ్‌ కుటుంబానికే అని ప్రచారం ఉంది. అప్పుడు సొంత పార్టీ నేతలే ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా? అని ఫిర్యాదులు చేశారు. ఆ తరువాత ఆర్థికంగా బలంగా ఉన్న మారిటైమ్‌ బోర్టు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు వెంకటరెడ్డి స్థానికేతరుడు అని ముద్ర వేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం గత చరిత్ర పరిశీలిస్తే, వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే ఎన్నికైన కీర్తిశేషులు ఎం.వి.కృష్ణారావుకు ఓటర్లు అండగా నిలిచారు. అదేబాటలో కాయల వెంకటరెడ్డికి కూడా టిక్కెట్‌ ఇస్తే అన్ని తరగతుల ఓటర్ల మద్దతు ఉంటుందని పార్టీ పెద్దల ఆలోచనలు. మొత్తం మీద ఇచ్ఛాపురం వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఉత్కంఠగా మారుతుంది.

➡️